Free Bus Journey for Women: గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్! ఎప్పట్నుంచంటే
అమరావతి, డిసెంబర్ 31: కూటమి సర్కార్ ఏపీ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండగ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (డిసెంబర్ 30) తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు…