
Donald Trump: అమెరికాలో స్వర్ణయుగం మొదలైంది.. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం
అమెరికాలో స్వర్ణయుగం మొదలైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారిగా ప్రసంగించారు. అమెరికా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడిందన్నారాయన. ‘అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తాం. దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యమైనదిగా మారింది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు. విద్యావ్యవస్థలో అనేక మార్పులు రావాలి. న్యాయవ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది….