రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణంతో..
అమరావతిలో నిలిచిన పనులను స్పీడ్ అప్ చేసింది కూటమి సర్కార్. గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈమేరకు రాజధాని అమరావతిలో 2వేల 816 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది సీఆర్‌డీఏ. రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ఈనెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను…