Video: పాపం పంత్.. తొలి సిక్స్ కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడో.. చర్మం కమిలిపోయిందిగా
రిషబ్ పంత్ మైదానంలో కనబరిచిన వీరోచిత ఆట తీరు అభిమానులను చలించగొట్టింది. సిడ్నీ టెస్టులో గాయాలతో తల్లడిల్లినా, అతను క్రికెట్‌కు పుట్టిన యోధుడిగా తనదైన ముద్ర వేసాడు పంత్. మిచెల్ స్టార్క్ బంతులు అతని చేతులు, శరీరంపై గాయాలు మిగిల్చినా, పంత్ తన ధైర్యాన్ని ప్రదర్శించి సిక్సర్‌ను కొట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. పంత్ గాయంతోనూ ప్రదర్శించిన పోరాటపటిమ టెస్టు క్రికెట్‌కు గొప్ప ఉదాహరణగా నిలిచింది. చేతుల్లో రక్తం గడ్డకట్టినా, తన జట్టును కష్టాల్లో పడనివ్వకుండా మ్యాచ్‌ను ముందుకు…