
Telangana: ఉద్యోగాలన్నారు.. నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా..
ఈజీ మనీ కోసం కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఉద్యోగాలను ఎరగా వేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే మిర్యాలగూడలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాళ్లపల్లి శ్రీధర్ స్థానిక విద్యానగర్‌లో రెండేండ్ల కింద గ్రామీణ ఉద్యోగ సేవా కేంద్రం ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ కు చెందిన ఖాసీంకు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే ఏపీ…