
వార్నీ వీడెవడండీ బాబు.. పిల్లకు బదులు రైస్ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.!
పెళ్లికాని వాళ్ళకి పెళ్లి కాలేదనే బాధ ఒక్కటే ఉంటుంది. కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి వందలాది బాధలు వెంటాడుతుంటాయి. పెళ్లి చేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలు అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి, అత్తమామల గురించి ఆందోళన చెందుతుంటారు. అప్పుడు అబ్బాయి కూడా ఇలాగే… అమ్మాయి తమతో సర్దుబాటు చేసుకోగలదా లేదా అని ఆందోళన చెందుతాడు. ఈ కారణంగానే చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి ప్రస్థావన అంటేనే భయపడిపోతుంటారు.. కోరి వివాహ ఇబ్బందులను తెచ్చుకోవటం ఎందుకని భావిస్తుంటారు….