
Telangana: ఇకపై సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే తాటతీసుడే.. ఏసీపీ మాస్ వార్నింగ్
ఖమ్మం, ఫిబ్రవరి 13: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రెహ్మాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ, కుల, మత, ప్రాంతీయ…