
Viral: సరైనోడు.. స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురీడి కొట్టించి.. వాడి దగ్గర డబ్బులు నొక్కేశాడు
స్కామర్స్ ఈ మధ్య చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ డిజిటల్ అరెస్ట్. మీ పేరుతో డ్రగ్స్ డెలివరీ అయ్యాయి.. మీ అమ్మాయి/అబ్బాయి అక్రమ బంగారం తరలిస్తూ పట్టుబడ్డారు.. అంటూ పోలీస్, సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ ఏజెన్సీల పేరుతో కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. వదిలెయ్యాలంటే.. డబ్బులు ముట్టుజెప్పాలంటే.. దోచేయడం మొదలెట్టారు. ఈ తరహా క్రైమ్స్‌పై ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాల్ చేసిన ఓ స్కామర్‌లో బురిడీ కొట్టించాడు…