
Myanmar Earthquake: ప్రకృతి ప్రళయానికి మయన్మార్ విలవిల.. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం..?
మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. అయితే ఈ భూకంపం సాధారణమైంది కాదు.. 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. మయన్మార్‌లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. కొన్ని వేలమంది క్షతగాత్రులయ్యారు. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ అంతుచిక్కని జాడగానే మిగిలిపోయింది. 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ స్థాయిలో విషాదాన్ని మిగిల్చాయి….