
Burnt Milk Pan: మాడిన పాల గిన్నె చిటికెలో తళతళ మెరిపించే టిప్స్.. రెండు నిమిషాలు చాలంతే!
పాల గిన్నెను శుభ్రం చేయడం నిజంగా చాలా కష్టం. పాలు ఆరిపోయినప్పుడు, అది గిన్నెకు గట్టిగా అతుక్కుపోతుంది. సాధారణంగా వీటిని కడగడం చాలా కష్టం. అయితే, ఈ మరకలను సులభంగా తొలగించడానికి ఈ కింది ఇంటి నివారణలు ఉపయోగపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. వేడి నీరు – బేకింగ్ సోడా ముందుగా గిన్నెలో వేడి నీటిని పోసి, కాసేపు నాననివ్వాలి. తరువాత 1 టీస్పూన్ బేకింగ్ సోడా చల్లుకోవాలి. కొద్దిసేపు ఆగి స్పాంజ్ లేదా గట్టి బ్రష్…