
Telangana: అంగన్‌వాడీ కేంద్రాలకు ‘సీడ్ కిట్స్.. ఇకపై అక్కడే పండనున్న పండ్లు, కూరగాయలు!
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలోనే చిన్న తరహా పోషకాహార కేంద్రాలుగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ (Nutri Gardens) కార్యక్రమంలో భాగంగా.. ఈ కేంద్రాలకు కూరగాయలు, పండ్ల విత్తనాలతో కూడిన కిట్లు అందించనున్నారు. ఈ విత్తన కిట్‌లలో పాలకూర, తోటకూర, టొమాటో, వంకాయ, బెండకాయ, మెంతికూర వంటి పౌష్టిక కూరగాయలు ఉంటాయి. నిర్వహకులు కేంద్రం అందించే ఈ విత్తనాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పంట పండించి. వాటి నుంచి వచ్చిన కూరగాయలతోనే చిన్నారు,…