
Bihar: ప్రశాంత్ కిషోర్‌కు తృటిలో తప్పిన ప్రాణాపాయం… బీహార్‌లో రోడ్డు షోలో ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. శుక్రవారం బీహార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. శుక్రారం అరా సిటీలో సభకు హాజరయ్యారు ప్రశాంత్ కిషోర్. సభ అనంతరం నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఒక గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా…