
Aadhaar: ఎక్కడ పడితే అక్కడ వాడలేం.. ఈ ఆధార్ నిబంధనలు మీకు తెలుసా?
భారతదేశంలో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన పత్రాల్లో ఆధార్ ఒకటి. పేరు, చిరునామా, గుర్తింపు, పౌరసత్వం విషయాల్లో ఇది చాలామంది దృష్టిలో ఒక ‘ప్రత్యేక గుర్తింపు పత్రం’. అసలు విషయం ఏమిటంటే, ఆధార్ కొన్ని నిర్దిష్ట సేవలకు మాత్రమే చట్టబద్ధంగా ఉపయోగపడుతుంది. పలు సందర్భాల్లో దీనిని రుజువుగా పరిగణించరు. ఆధార్ పత్రం గురించిన సమగ్ర వివరాలు తెలుసుకోవడానికి ఈ కింది అంశాలు చాలా ముఖ్యం. ‘ఆధార్’ సంస్కృత పదం. దీని అర్థం “పునాది” లేక “బేస్”. ఈ…