
Tribal Culture: అడవంతా సంగీతం.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న గిరిజన వాద్యం
ఆదివాసీ సంగీత వాయిద్య ప్రపంచం.. సముద్రమంత లోతైనదీ.. ఆకాశమంత విశాలమైనదీ… పుట్టుక నుండి చావు వరకు.. ఎందెందు వెతికినా అందదు కలదు అన్నట్టుగానే కనిపిస్తూ.. వీనుల విందు చేసేలా మైమరపింప చేస్తూ సాగుతోంది. ఆఫ్రికా అడవుల్లో మారు మోగే డోల్ డప్పుల శబ్దం అనంత దూరంలో ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్ గోండు గిరిజన గూడెంలో ప్రతిధ్వనిస్తోంది. నేటీవ్ అమెరికన్ల ఫ్లూట్ గమకాలు ప్రాణహిత పరివాహక ప్రాంతానికి చెందిన నాయకపోడ్‌ల పిల్లనగ్రోవిలో జాలువారతున్నాయి. ఈశాన్య భారతంలోని నాగాల…