
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం.. ఎక్కడికైనా నడిచి వెళ్లాల్సిందే.. శత్రుదుర్భేద్యంగా వాషింగ్టన్..
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో…అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. గతంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, దాడులు, కొత్త ఏడాదిలో…