
Telangana: రెచ్చిపోయిన కలప స్మగర్లు.. అటవీ సిబ్బందిపై దాడి.. వాహనాలు ధ్వంసం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ కలప నిల్వ చేశారన్న ముందస్తు సమాచారంతో అటవీశాఖ దాడులకు దిగింది. లక్షల రూపాయల విలువైన కలపను స్వాధీనం చేసుకుంది. కలపను కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో అటవీశాఖ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. దాడుల్లో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్‌కు గాయాలయ్యాయి. రెండు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు….