
Ananth Sriram: ‘సిగ్గుపడుతున్నా’ కల్కీ సినిమాపై రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్
హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని.. కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు చెప్పారు. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్…