
Pakistan vs Taliban: పాముకు పాలు పోస్తే ఇంతే మరి.. 19 మంది పాక్ సైనికులను చంపి.. 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
పాము విషం చిమ్ముతుంది.. అది దాని నేచర్ అని తెలిసి కూడా పెంచుకుంటే ఏమవుతుంది.. పెంచిన వారినే కాటేస్తుంది.. ఇదే విధంగా ఉంది ప్రస్తుతం మన దాయాది దేశం పాకిస్తాన్ పని. తాను పెంచి పోషించిన తాలిబన్లు తమపైనే కత్తులు దూస్తారని అసలు ఊచించి ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు కూడా మొదటిగా ప్రభుత్వాన్ని గుర్తించింది పాకిస్తాన్.. అయితే ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ కయ్యానికి…