
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం.. ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
రాజమౌళి కుటుంబం ఒకే ఇంట్లో కలిసి జీవిస్తుందని చాలా మందికి తెలుసు. తండ్రి, సోదరులు అందరూ దాదాపు ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఆ ఇంటి హాలులో తలుపుకు ఎదురుగా గోడపై ఒక మహనీయుని చిత్రం పటం ఉంటుంది. అదెవరిదో కాదు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ది. ప్రపంచంలోని గొప్ప నాయకులలో అంబేద్కర్ కూడా ఒకరు. రాజ్యాంగాన్ని రూపొందించిన ఆయన లక్షలాది అణగారిన వర్గాల జీవితాలకు సాధికారత కల్పించారు. అయినా కూడా అంబేద్కర్ కొన్ని…