IND vs AUS: రోహిత్ ,కోహ్లీ వచ్చేస్తున్నారు.. ఆస్ట్రేలియాతో టీ20, వన్డేలు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో

IND vs AUS: రోహిత్ ,కోహ్లీ వచ్చేస్తున్నారు.. ఆస్ట్రేలియాతో టీ20, వన్డేలు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో


ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్ కు ముందు భారత జట్టు ఎక్కువగా టీ20లు, వన్డేలు ఆడడంపైనే దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియాలోనూ పర్యటించనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19, 2025న పెర్త్ నుండి ప్రారంభమై అక్టోబర్ 25న సిడ్నీలో ముగుస్తుంది. ఆశ్చర్యకరంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్‌ల అన్ని మ్యాచ్‌ల టిక్కెట్లు అమ్ముడయ్యాయని వార్తలు వస్తున్నాయి. బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా వన్డే సిరీస్‌లో ఆడనుండడం దీనికి కారణం కావొచ్చు.

ఆస్ట్రేలియా- భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్..

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్..

  • తొలి వన్డే: అక్టోబర్ 19 – పెర్త్ స్టేడియం
  • రెండో వన్డే: అక్టోబర్ 23 – అడిలైడ్ ఓవల్
  • మూడో వన్డే: అక్టోబర్ 25 – సిడ్నీ క్రికెట్ స్టేడియం

వన్డే సిరీస్ తర్వాత, రెండు జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి, ఇది అక్టోబర్ 29న కాన్‌బెర్రాలో ప్రారంభమై నవంబర్ 8న బ్రిస్బేన్‌లో ముగుస్తుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ సిరీస్, రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు సన్నద్ధమయ్యేందుకు మంచి అవకాశం.

టీ20 సిరీస్.

  • తొలి టీ20: అక్టోబర్ 29 – కాన్‌బెర్రా
  • రెండో టీ20: అక్టోబర్ 31 – మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్
  • మూడో టీ20: నవంబర్ 2 – హోబార్ట్
  • నాలుగో టీ20: నవంబర్ 6 – గోల్డ్ కోస్ స్టేడియం
  • ఐదో టీ20: నవంబర్ 8 – గబ్బా క్రికెట్ స్టేడియం

కోహ్లీ-రోహిత్ ల కోసం..

అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. “సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే వన్డే, కాన్‌బెర్రాలోని టీ20ఐ టిక్కెట్లు నాలుగు నెలల ముందుగానే అమ్ముడయ్యాయి. ఇది ఈ మ్యాచ్‌లకు అధిక డిమాండ్‌ను సూచిస్తోంది. ఈ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా, ఎంసిజిలో జరిగే టీ20 , గబ్బాలో జరిగే టీ20ఐలకు కూడా అధిక డిమాండ్ ఉంది” అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *