Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (జూన్ 30, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.  మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి కొత్త ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. బంధుమిత్రుల్లో కొందరికి వీలైనంతగా ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు బాగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. అధికారులను పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆదా యం ఆశించిన స్థాయిలో పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఆర్థిక సహాయం విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాల బాటపడతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడ తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా నిలకడగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలున్నాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *