టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హరి హర వీరమల్లు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో పవన్ జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా యోధుడిగా పవన్ కళ్యామ్ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అదిరిపోయింది.
దాదాపు మూడు నిమిషాల 1 సెకను నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్స్ మరింత హైలెట్ అయ్యాయి. ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనుపమ్ కేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న సంధ్య థియేటర్లో ట్రైలర్ స్క్రీనింగ్ ప్లాన్ చేసింది చిత్రయూనిట్. కానీ జూలై 2న ఉదయం ఎంట్రీ పాస్ ల కోసం భారీగా అభిమానులు రావడం.. పరిస్థితి నియంత్రణ చాలా కష్టమైంది. దీంతో భద్రతా కారణాలతో ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి..
Prabhas : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నన్ను చెత్తగా చూపించారు.. నయనతార కామెంట్స్..
Tollywood: చేసేది సీరియల్స్.. స్టార్ హీరోలను మించి ఆస్తులు సంపాదించిన బ్యూటీ.. ఎవరంటే..
Telugu Cinema: అప్పుడు సీరియల్లో పద్దతిగా.. ఇప్పుడు ఇలా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?