Credit Score: సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్‌తో లోన్ పొందడం చాలా ఈజీ

Credit Score: సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్‌తో లోన్ పొందడం చాలా ఈజీ


Credit Score: సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్‌తో లోన్ పొందడం చాలా ఈజీ

సిబిల్ స్కోరు అంటే మీ క్రెడిట్ హిస్టరీతో పాటు క్రెడిట్ యోగ్యతకు సంబంధించిన రిపోర్ట్ కార్డ్. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఆమోదించడానికి 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అనేది క్రెడిట్ దరఖాస్తులను ఆమోదించడానికి పరిగణించే అంశాల్లో ఒకటిగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పేర్కొన్న నగరాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఆ నగరాల్లో నివసించే పౌరులకు మాత్రమే అవి క్రెడిట్ ఉత్పత్తులను ఆమోదించవచ్చు. ఉదాహరణకు హెచ్ఎస్‌బీసీ వెబ్‌సైట్ ప్రకారం హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలలో ఒకటి దరఖాస్తుదారు నివసించే నగరం. చెన్నై, గుర్గావ్, ఢిల్లీ, పూణే, నోయిడా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్ లేదా కోల్‌కతా వంటి నగరాల్లో ఉంటేనే రుణాన్ని మంజూరే చేస్తాయి.

అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ దరఖాస్తుల కోసం ఆదాయ అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తాయి. క్రెడిట్ కార్డుల విషయంలో ఒకే బ్యాంకుకు ఆదాయ అర్హత కార్డు నుంచి కార్డుకు మారుతుంది. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కోసం రూ. 12,000 కంటే ఎక్కువ నికర నెలవారీ ఆదాయం ఉండాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ-లెవల్ క్రెడిట్ కార్డ్. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం రూపొందించారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సంవత్సరానికి రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉండాలి.

ఉద్యోగాల మార్పు 

మీరు తరచుగా ఉద్యోగాలు మారుతుంటే మీ కెరీర్‌లో అస్థిరంగా ఉన్నందున బ్యాంక్ దానిని పరిగణిస్తుంది. బ్యాంకులు తమ రుణగ్రహీతలు స్థిరమైన కెరీర్‌ను కలిగి ఉండాలని ఇష్టపడతారు. కెరీర్ స్థిరత్వం నెలవారీ ఆదాయం క్రమం తప్పకుండా రావడానికి హామీ ఇస్తుంది. దీనిని వ్యక్తిగత రుణ ఈఎంఐ ఇతర బాధ్యతలకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

అధిక డీటీఐ నిష్పత్తి

రుణ బాధ్యతలను (రుణ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బాకీలు) తీర్చడానికి ఉపయోగించే ఆదాయం శాతాన్ని రుణం నుంచి ఆదాయం నిష్పత్తి కొలుస్తుంది. సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఆమోదించడానికి 35 శాతం లేదా అంతకంటే తక్కువ డీటీఐ నిష్పత్తిని మంచిదని పరిగణిస్తాయి. ఇతర అర్హత ప్రమాణాలు నెరవేరిస్తే కొన్ని బ్యాంకులు 36 నుండి 50 శాతం పరిధిలో డీటీఐ నిష్పత్తితో వ్యక్తిగత రుణ దరఖాస్తులను పరిగణించి ఆమోదించవచ్చు. అలాగే 50 శాతం కంటే ఎక్కువ డీటీఐ నిష్పత్తితో వ్యక్తిగత రుణ దరఖాస్తు అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

కేవైసీ డాక్యుమెంట్ సమస్యలు

మీరు క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తు ఫారమ్‌తో పాటు మీరు నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాలను సమర్పించాలి. వీటిలో మీ ఫోటోగ్రాఫ్ కాపీ, గుర్తింపు, చిరునామా రుజువు ఉన్నాయి. ఏవైనా కేవైసీ పత్రాలు లేకుంటే లేదా ఏవైనా సమస్యలు ఉంటే, క్రెడిట్ దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *