ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ట్రైన్‌లో దొంగలు ఎక్కువగా ఉంటారు. ప్రయాణ సమయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు తమ చేతివాటం చూపేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోవడంతో చాలా మంది తమ వద్ద డబ్బులను పెట్టుకోవడం మానేశారు. దీంతో దొంగలకు దోచుకుందాంమంటే ఎవరి దగ్గరా డబ్బులు కనిపించట్లేదు.. అందుకే వాళ్లు కూడా ఇప్పుడు రూట్ మార్చారు. డబ్బులకు బదులుగా సెల్‌ఫోన్‌లు కొట్టేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు. ట్రైన్‌లోపలే కాదు.. ట్రైన్ బయట నుంచి కూడా ఫోన్‌లను కాజేసేందుకు దొంగలు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
यह चोर कहां का चोर है बड़ा ईमानदार है चोरी भी करता है
वीडियो बनाकर सबको बताता भी है कि हम चोरी कर रहे हैं pic.twitter.com/5lYzjPteSc
— Bhanu Nand (@BhanuNand) July 3, 2025
ఓ సోషల్ మీడియా యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ రైలు వేగంగా ప్రయాణిస్తుంది.. ఆదే సమయంలో ఓ వ్యక్తి రైలు పట్టాల పక్కన ఒక కర్రను పట్టుకుని నిలబడి ఉన్నట్టు మనం చూడవచ్చు. అయితే ఎవరైనా ఫోన్ పట్టుకొని ట్రైన్ డోర్ దగ్గర నిలబడితే వారిని టార్గెట్ చేసి.. వాళ్ల చేతిపై కర్రతో కొడుతున్నాడు. వాళ్ల చేతిలో ఉన్న ఫోన్ కిందపడగానే దాన్ని తీసుకొని పారిపోయాడు. దీన్నంత వీడియో కూడా తీశాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.