రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెరకెక్కుతోంది. రామాయణ్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతమ్మగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ యాక్ట్ చేస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మైథాలజీ మూవీకి దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించారు. ఆయనతో హీరో యష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఇప్పటికే రామయాణ్ మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. దీనికి సినీ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక రణ్ బీర్ కపూర్ లుక్కు బాగుందంటూ కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రామాయణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. అదేంటంటే.. ఈ మూవీల రాముడి పాత్ర కోసం ముందుగా ఓ టాలీవుడ్ హీరోను అనుకున్నారట. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో రణ్ బీర్ కపూర్ లైన్ లోకి వచ్చాడట. ఆ హీరో మరెవరో కాదట సూపర్ స్టార్ మహేష్ బాబు.
రామయణంలో రాముడి పాత్ర కోసం నితీష్ తివారీ కూడా మొదట మహేష్ కావాలని పట్టుబట్టారట. రామాయణం కథ, రాముడి పాత్ర గురించి మహేష్ తో కూడా నితీష్ చర్చించారట. మహేష్ కూడా ఈ సినిమాపై బాగానే ఆసక్తి చూపించారట. కానీ అప్పటికే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ప్రాజెక్ట్ కు కమిటై పోవడంతో
రామాయణం కోసం కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి తలెత్తిందట. దీంతో అయిష్టంగానే మహేష్ రామాయణ్ సినిమాను వదులుకున్నారట. అయితే ప్రస్తుతం ఇది రూమర్లు మాత్రమే. ఇందులో ఎంత నిజముందో చిత్ర బృందమే క్లారిటీ ఇవ్వాలి.
కాగా రామాయణం’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి దూబే, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, అరుణ్ గోవిల్ తదితరులు ఈ సినిమాలో వివిధ పాత్రల్లో కనిపించనున్నారు.
&
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..