ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. సుమారు 3కిలో మీటర్లు పిల్లలు ఆ కొండచిలువను పట్టుకొని తిరిగినట్టు స్థానికులు తెలిపారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండచిలువను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆశ్చర్యకర ఘటన బులంద్‌షహర్ ప్రాంతంలో వెలుగు చూసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్‌లోని డంగ్రా జాట్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రామస్తులకు ఒక 15 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పలుగురు తీశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు పిల్లలు ఆ కొండచిలువను చూసేందుకు వచ్చారు. అది ఉలుకూ పలుకూ లేకుండా పడిపోవడంతో చనిపోయిందేమోనని గ్రహించి. దాన్ని చేతుల్లోకి ఎత్తుకొని గ్రామ రోడ్ల గుండా ఊరేగిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ తీసుకెళ్లారని, అందులో కొంత మంది దాని తల, మధ్య భాగం పట్టుకొగా మారికొందరు తొకనుపట్టుకున్నారు. పిల్లల చేతిలో కొండచిలువను చూసిన రోడ్డుపై వేళ్లే వాహన దారులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
A 15-foot-long giant python was spotted in Bulandshahr UP. Villagers and children captured the python with their hands. pic.twitter.com/CyDHNkH655
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 7, 2025
ఇక ఈ వైరల్ వీడియోపై స్పందించిన ఫారెస్ట్ అధికారులు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. పర్యవేక్షణ లేకుండా కొండచిలువలు వంటి అడవి సరీసృపాలను ఇలా తీసుకురావడం ప్రమాదకరమని, అంతేకాకుండా ఇలాంటి పనులు భారత వన్యప్రాణుల రక్షణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడంమేనని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.