హర్యానాలోని పానిపట్‌లో తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళపై రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నిందితులు ఆ మహిళను రైల్వే ట్రాక్‌పై పడవేసి పారిపోయారు. దీంతో ఆ మహిళను రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. లోకో పైలట్ ఈ సంఘటన గురించి GRPకి సమాచారం అందించాడు. గాయపడిన మహిళను చికిత్స కోసం రోహ్‌తక్ PGIలో చేర్చారు.
జూన్ 24న ఒక మహిళ తన భర్తతో ఏదో విషయంలో గొడవపడి పానిపట్ నుండి తన తల్లి ఇంటికి వెళుతుండగా.. జూన్ 25న భర్త తన భార్య అదృశ్యం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ ప్రకారం.. ఎవరో ఆమెను ఇంటి దగ్గర దింపుతానని హామీ ఇచ్చి మోసం చేసి, రైల్వే స్టేషన్‌లోని రైలులోని ఖాళీ కంపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. నలుగురు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారు.
తనను వదిలిపెట్టాలని ఆ మహిళ నిందితులను వేడుకుంది. వారి కాళ్ళపై పడి పారిపోవడానికి కూడా ప్రయత్నించింది. కానీ నిందితులు మృగాలుగా ప్రవర్తించారు. అత్యాచారం చేసిన తర్వాత ఆ మహిళను రైల్వే ట్రాక్‌పై విసిరేశారు. మహిళను ఎదురుగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఆమె ఎడమ కాలు తెగిపోయింది. లోకో పైలట్ ఈ విషయాన్ని గమనించి GRPకి తెలియజేశాడు. GRP సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఇల్లు వదిలి వెళ్లడం వల్ల ఇలా జరుగుతుందని తనకు తెలియదు. తన భర్తతో ఇంతకు ముందు చాలాసార్లు గొడవలు పడ్డానని, కానీ ఇలా ఎప్పుడూ జరగలేదని, తాను ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్లలేదని చెప్పింది. భర్తతో గొడవ తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లడం ఇదే మొదటిసారి. కొంతమంది యువకులు తనను ఇంటికి దగ్గర దింపుతామని చెప్పి బలవంతంగా కారులోకి లాక్కెళ్లి, రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఖాళీగా ఉన్న కంపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి తనపై దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది. రైలు ముందు, వెనుక ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు ప్రయాణికులతో నిండి ఉన్నాయని, కానీ ఆ ఒక కంపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, అందులో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి