మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్

మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్


ప్రస్తుతం ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సిరీస్ లోని ఓ సన్నివేశంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈటీవీ విన్ సంస్థ వివరణ ఇచ్చింది. తాజాగా ఇదే విషయంపై సందీప్‌ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. “డియర్ బ్రదర్స్.. 2025 ఏడాదిని ఎంతో గొప్పగా ప్రారంభించాను. డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో నాకు లభించిన ప్రేమ, మరింత కష్టపడేందుకు నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తుల నుంచి కోపం, ద్వేషాన్ని చూడడం నా మనసును కలిచివేస్తోంది. జనవరిలో మీ ప్రేమాభిమానాలకు నేను అర్హుడినో కాదో తెలియదు.. కానీ జూలైలో వస్తోన్న ఈ ద్వేషానికి అర్హుడనా? అంటే స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. నేను ఈ విషయాలను కప్పిపుచ్చడానికి, మేము చేసిన దానికి సమర్థించడానికి ఇక్కడ లేను. ఎల్లప్పుడూ ప్రేక్షకులే కరెక్ట్‌ అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే ఒక చిత్రనిర్మాతగా నమ్ముతాను. ఆ కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే అందులో భాగమైనందుకు చాలా చింతిస్తున్నాను. నాకు ఎవరిపై కోపం, ద్వేషం లేదు. ఎవరినీ లక్ష్యంగా కూడా చేసుకోలేదు. మిమల్ని ఇబ్బందిపెట్టిన ఆ సీన్‌ను ఇప్పటికే తొలగించాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్మికపై పని ఒత్తిడి.. బాధేస్తుందంటూ హీరోయిన్ ఎమోషనల్

ముందు మహేషే రాముడు !! కానీ ఆ ఇబ్బందితో పక్కకి..

ఏడుస్తూ.. హీరోయిన్.. అయినా కానీ సెల్ఫీ కోసం అభిమాని తమషా

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

త్వరలో లక్కీ భాస్కర్2.. సీక్వెల్‌ పై హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *