School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం!

School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం!


దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా ప్రతి నగరంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని నగరాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి. యూపీలోని ఝాన్సీ, సాగర్, మాండ్లా, రైసేన్, భండారా, నైనిటాల్‌లలో కుండపోత వర్షం కురిసింది. ఝాన్సీలో భారీ వర్షాల కారణంగా ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించాయి. రోడ్లన్ని మునిగిపోయాయి. నాగ్‌పూర్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు అధికారులు. ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా మారిన్ని సెలవులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాసంస్థల విషయంలో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు కంటిన్యూగా కురిస్తే విద్యాసంస్థలు మూసివేయాలని ప్రకటించారు. వాతావరణ శాఖ ఈ ప్రదేశానికి అరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. యూపీలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారుల ప్రకటన వరకు పాఠశాలలు తెరవకూడదని సూచించింది ప్రభుత్వం.

ఈ రాష్ట్రాల్లో వర్ష హెచ్చరిక

వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ప్రకారం, త్రిపుర, దక్షిణ బంగ్లాదేశ్, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్‌లలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. విదర్భ, తీరప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.

ఉత్తర పంజాబ్, ఉత్తర హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే ఈశాన్య భారతదేశంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 24 గంటల తర్వాత పంజాబ్, హర్యానా, పశ్చిమ, మధ్య ఉత్తరప్రదేశ్‌లలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఢిల్లీలో..

వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కావచ్చు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకైతే ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. జూన్ లో లోటు వర్షపాతం నమోదవగా జులైలో అయినా వరుణుడు కరుణిస్తాడని తెలుగు ప్రజలు భావించారు. భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఈ నెలంతా భారీ వర్షాలుంటాయి తెలిపింది. కానీ జులైలో కూడా తొమ్మిదో రోజుకు చేరుకున్నాం… కానీ ఇప్పటివరకు ఒకటి, రెండు సార్లు మాత్రమే భారీ వర్షాలు కురిసి మళ్లీ వెనక్కి తగ్గాయి.

అయితే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మెల్లమెల్లగా కదులుతున్నాయని, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో కూడా అల్పపీడనం, ఆవర్తనం, ద్రోణి వంటివి ఏర్పడుతూ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోనున్నాయని… తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు… ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. బుధవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Minimum Balance: కస్టమర్లకు పండగలాంటి వార్త చెప్పిన మరో బ్యాంకు.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్స్‌ రద్దు

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. కేవలం లక్ష పెట్టుబడితో రూ.1.5 కోట్ల రాబడి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *