దిన ఫలాలు (జూలై 10, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బాగానే ఉండే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మీ విషయంలో సానుకూలంగా వ్యవహరించడం ప్రారంభిస్తారు. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. సామాజికంగా గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద బాగా నమ్మకం పెట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. విలాసాలు, అనవసర పరిచయాలు మీద ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయ వ్యయాలు సమానంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే అవకాశాలు లభిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలాలకు, ప్రోత్సాహకాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతి కరువవుతుంది. తల్లి తండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదం రాజీమార్గంలో పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి. భాగస్వాములతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొద్దిగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదారాభిమానాలను చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. వృథా ఖర్చులు తగ్గించుకుంటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏ ప్రయత్నమైనా వ్యయ ప్రయాసలతో గానీ నెరవేరకపోవచ్చు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. చదువుల్లో పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీ సమర్థత బాగా వెలుగు లోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి.