Headlines

ఈ ముక్కులు కొరుకుడేందిరా సామి.. EMI కట్టట్లేదని గొడవ.. భార్య ముక్కును కొరికేసిన భర్త.. తర్వాత ఏం జరిగిందంటే..

ఈ ముక్కులు కొరుకుడేందిరా సామి.. EMI కట్టట్లేదని గొడవ.. భార్య ముక్కును కొరికేసిన భర్త.. తర్వాత ఏం జరిగిందంటే..


ఇటీవల కొందరు భర్తలు భార్యల ముక్కును కొరుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే ఓ భర్త తన భార్య ముక్కు అందంగా ఉందని కొరకగా.. మరో భర్త భార్య ప్రియుడితో ప్రేమాయణం సాగిస్తుందన్న కోపంలో ఆమె ముక్కును కొరికాడు. తాజాగా కర్ణాటకలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. తీసుకున్న ఈఎమ్‌ఐ సరిగ్గా కట్టట్లేదని ఊగిపోయిన భర్త.. భార్యతో గొడవపడి ఏకంగా ఆమె ముక్కును కొరికేశాడు. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావణగెరెకి చెందిన విజయ్‌కు విద్యా అనే కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక వీరిద్దరూ ప్రైవైటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య విద్యా అవసరం నిమిత్తం ఓ లోన్‌ తీసుకుంది. దానికి భర్తను జామీనుగా ఉంచింది. అయితే తను తీసుకున్న లోన్‌ ఈఎంఐలను విద్య సరిగ్గా చెల్లించలేకపోయింది. దీంతో ఆమె లోన్‌ తీసుకున్న ఫైనాన్స్ వారు జామీనుగా ఉన్న తన భర్త విజయ్‌ను వేధించడం స్టార్ట్‌ చేశారు. దీంతో ఈ విషయంపై భార్యభర్తల మధ్య వివాదం నెలకొంది.

ఈ క్రమంలో భార్యతో గొడవకు దిగిన భర్త విజయ్ ఆమెను నేలపైకి తోసేశాడు. ఆపై ఆమెపై కూర్చొని భార్య ముక్కును కొరికేశాడు. నొప్పి తట్టుకోలేక భార్య విద్యా గట్టిగా కేకలు వేసింది. విద్యా అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యా మోహంపై రక్తపు మరకలు చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ విద్యను పరీక్షించిన వైద్యులు అమెకు చికిత్స అందిచారు. ప్రస్తుతం విద్యా హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *