చాలా మంది రుచి కోసం, బిర్యానీ ఘుమఘుమల కోసం వివిధ మసాలాలు వాడుతుంటారు. అందరికీ తెలిసినవి చికెన్ మసాలా, సాంబార్ మసాలా, బిర్యానీ ఆకులు లాంటి ఉన్నాయి. వీటితో కర్రీకి, బిర్యానీకి మరింత టెస్ట్ వస్తుందని విపరీతంగా వాడేస్తుంటారు. ప్రజల్లో వీటికున్న క్రేజ్, పైగా నిత్యావసర వస్తువు కావడంతో కొంతమంది నీచులు వీటిని కల్తీ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ.. డబ్బు సంపాదనే లక్ష్యంగా నీచానికి దిగజారుతున్నారు. తాజాగా ఓ కల్తీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని మాన్వి పట్టణంలోని ఇస్లాం నగర్‌లోని ఒక శిథిలావస్థలో ఉన్న ఇంటి సమీపంలో ఈ కల్తీ మసాలా పదార్థాలను తయారు చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఆహార శాఖ అధికారులు దాడి చేసి మొత్తం 846 కిలోల కల్తీ మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొత్తిమీర గింజలు, మిరప గింజలు, బిర్యానీ ఆకులు, చికెన్ మసాలా, సాంబార్ మసాలాను రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. యూకలిప్టస్ చెట్టు ఆకులకు రంగు వేయడం ద్వారా బిర్యానీ ఆకులను తయారు చేస్తున్నారు. బొప్పాయి గింజలను మిరప గింజలతో కలిపి అమ్ముతున్నారు. తనిఖీలో కొత్తిమీర గింజలకు వివిధ రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. బఠానీలతో ఆకుపచ్చ రంగును కలిపి వినియోగదారులను అవి మిల్లెట్ అని నమ్మిస్తున్నట్లు ఆహార భద్రతా శాఖ అధికారులకు సమాచారం అందింది.
అధికారులు దాడి చేస్తుండగా కల్తీ రాకెట్ నడుపుతున్న నిందితుడు గఫూర్, అతని సహచరులు పారిపోయారు. ఈ దాడిలో మొత్తం 846 కిలోల వివిధ నకిలీ సుగంధ ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 367 కిలోల రంగు మిశ్రమ కొత్తిమీర గింజలు, 220 కిలోల పసుపు, వేరుశెనగలు, 150 కిలోల ఎర్ర శనగలు, 16 కిలోల ఎర్ర కొబ్బరి, 6.5 కిలోల యూకలిప్టస్ ఆకులు, 43 కిలోల బొప్పాయి గింజలు, 42 కిలోల రేకులు, 500 గ్రాముల పసుపు, ఎరుపు రసాయన పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులు ప్రస్తుతం ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి