
అప్పుడప్పుడు కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కొన్ని వీడియోలను చూస్తే నవ్వు ఆపుకోలేరు. వీడియోలో ఒక వ్యక్తి వైన్ బాటిల్ తీసుకోవడానికి వైన్స్ షాపు వద్దకు రాగా, బాటిల్ తీసుకునే క్రమంలో దుకాణం కౌంటర్‌లోని గ్రిల్‌లో తన మెడను ఇక్కుకుపోయింది.
ఆ పెద్దమనిషి మద్యం కొనడానికి ఎంత తొందరపడ్డాడంటే, లైన్‌లో నిలబడకుండానే నేరుగా గ్రిల్ దగ్గరకు వెళ్లి తన మెడను లోపల పెట్టాడు. మద్యం బాటిల్ చేతిలోకి రాగానే వెనక్కి తిరుగగా, అతని మెడ గ్రిల్‌లో ఇరుక్కుపోయింది . అతని మెడను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికి నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.
కష్టం మీద బయటకు తీశారు:
అతను తన మెడను గ్రీన్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఎంతకా రాలేదు. తీవ్రంగా శ్రమించిన తర్వాత మెడ బయటకు వచ్చింది. సమీపంలో నిలబడి ఉన్నవారిని కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ , ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన చాలా మంది నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి