Video : ఏమి జోకేశాడేమో..పంత్ తెగ నవ్వేస్తున్నాడు.. ఏదేమైనా గంభీర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది

Video : ఏమి జోకేశాడేమో..పంత్ తెగ నవ్వేస్తున్నాడు.. ఏదేమైనా గంభీర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది


Video : లార్డ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ రోజున టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇద్దరూ హ్యాపీ మూడ్ లో కనిపించారు. లార్డ్స్ బాల్కనీలో ఒక వీడియోలో పంత్, గంభీర్ ఇద్దరూ సహాయక సిబ్బందితో కలిసి నవ్వుతూ ఏదో జోక్ షేర్ చేసుకున్నట్లు కనిపించారు. ఈ దృశ్యం పంత్ బ్యాటింగ్‌కు వెళ్లడానికి కొద్దిసేపటి ముందు కెమెరాలో రికార్డయ్యింది. శుభ్‌మన్ గిల్ 16 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయిన తర్వాత, పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. గత రెండు టెస్టుల్లో 585 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకుని జామీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు.

ముందు రోజు వేలికి గాయం కావడంతో రిషబ్ పంత్ రెండో రోజు వికెట్ కీపింగ్ చేయలేదు. అయినా కూడా, బ్యాటింగ్‌లో పంత్ మంచి ఫామ్‌లో కనిపించాడు. 33 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కేఎల్ రాహుల్(53 నాటౌట్) తో కలిసి పంత్ వికెట్ పడకుండా 38 పరుగులు జోడించి, జట్టును నిలబెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇప్పటికీ భారత్ 242 పరుగులు వెనకబడి ఉంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో యశస్వి జైస్వాల్(13), కరుణ్ నాయర్(40), శుభమన్ గిల్(16) తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు.

ఇంగ్లాండ్ తరపున జో రూట్ 104 పరుగులు చేశాడు, బ్రైడాన్ కార్స్, జామీ స్మిత్ హాఫ్ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. పంత్ గాయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆందోళన చెందడం, ఆ తర్వాత ఇద్దరూ సరదాగా నవ్వుకోవడం వారి మధ్య ఉన్న మంచి సంబంధాన్ని సూచిస్తుంది. ఇది టీమ్ స్పిరిట్‌ను పెంచుతుంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *