వేములవాడ మటన్ మార్కెట్ ఏరియాకు చెందిన దీటి వేణుగోపాల్, రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.సూసైడ్ లేఖలో .. అన్నపూర్ణ దేవి కాపాడు.. కరుణించు, క్షమించు.! నా తలరాత ఇలా రాశావా.? అదే నీ కొడుక్కి అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా.! అందమైన కలల జీవితాన్ని గడపాలనుకున్నానని.. కానీ తన ఆశలన్నీ ఆవిరి అయ్యాయని రాసుకొచ్చాడు. తనకు మరోజన్మ అవసరం లేదని.. తన మృతదేహాన్ని కాశీలో ఖననం చేయమని అందులో రాశాడు. ఇప్పుడీ లేఖ సంచలనంగా మారింది.ఓవైపు దేవుడు గురించి రాస్తూ.. మరోవైపు తన దురదృష్టం గురించి కూడా చెప్పాడు సదరు యువకుడు. ఇలాంటి కష్టం ఎవరికి రావద్దని కోరాడు. అతడి ఆత్మహత్యతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మానసిక రుగ్మత కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!