Kota Srinivasa Rao: మర్చిపోవడానికి జ్ఞాపకమా? జీవితం.. గుండెనిండా భారాన్ని మోసిన కోటా..

Kota Srinivasa Rao: మర్చిపోవడానికి జ్ఞాపకమా? జీవితం.. గుండెనిండా భారాన్ని మోసిన కోటా..


కోట భలే నవ్వుతారు.. అదొక డిఫరెంట్‌ స్టైలు.. అలాగే డైలాగుల్లోనూ ఒక టైపులో ఉండే విరుపు ఆయనకే సొంతం… ఇక మాండలికాల్లో మాట్లాడాలంటే కోట తర్వాతే ఎవరైనా. తెలంగాణయాస ఆయనకు ఎంత గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొహమాటాల్లేవ్‌.. అనాలనుకున్నది అనేస్తారు.. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. ఐనా.. అందిరికీ ఆప్తుడయ్యారు.. అందుకే.. ఇప్పుడు కోట మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. కోటా శ్రీనివాస రావు 83 ఏళ్ల సంపూర్ణ జీవితం.. అందులో సినిమాల్లోనే 40 సంవత్సరాలు. ఈ నాలుగు దశాబ్దాల సినీప్రయాణంలో 5 భాషల్లో విలక్షణ క్యారెక్టర్లు.. మొత్తం 750 సినిమాలు..9 నంది అవార్డులు.. మరెన్నో ఇతర సత్కారాలు.. అంతకు మించి కోట్లాది మంది అభిమానుల ప్రేమ ఆయనకే సొంతం. కానీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యతలు సంపాదించుకున్నప్పటికీ మనసు మాత్రం ఎప్పుడూ సంతోషంగా లేదు. గుండెల్లో భరించలేని బాధను ఒంటరిగానే మోస్తూ.. రెప్పదాటని కన్నీళ్లతో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కానీ 15 ఏళ్ల క్రితం కొడుకు మరణంతో మానసికంగా కుంగిపోయారు.

1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. కానీ 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించారు. భరోసాగా ఉంటాడనుకున్న కొడుకు మరణంతో తల్లడిల్లిపోయారు కోటశ్రీనివాస రావు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కు తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా ? అని గతంలో ప్రశ్నించగా.. కోటా మాట్లాడుతూ.. ” మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా ? జీవితం.. ఎలా మర్చిపోతాను ? నటనలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధను తట్టుకోగలిగాను అంతే ” అంటూ గుండెల్లో మోస్తున్న బాధను బయటపెట్టారు.

1973లో నా భార్య డెలివరీ సమయంలో ఆమె తల్లి చనిపోయారని.. దీంతో ఆమెకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది.. తర్వాత తను సైకియాట్రిక్ పేషెంట్ గా మారిపోయి.. దాదాపు 30 ఏళ్లపాటు తానెవరో గుర్తుపట్టలేదని అన్నారు. తను తిట్టినా ఓర్పుగా సహించానని అన్నారు. విజయవాడలో బంధువులతో కలిసి నా రెండో కూతురు రిక్షా ఎక్కింది.. కానీ ఎదురుగా బ్రేకులు ఫెయిలైన లారీ ఆ రిక్షాను ఢీకొట్టడంతో కొందరు చనిపోయారు. ఆ ప్రమాదంలో నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరిదగ్గరైతే గుమాస్తాగా పనిచేశానో అతడే నాకు వియ్యంకుడయ్యారు. కూతురు జీవితం బాగుందని సంతోషించేలోపే నా కొడుకు చనిపోయాడు. ఎంతో పేరిచ్చిన భగవంతుడు అన్ని కష్టాలను కూడా ఇచ్చాడు. అన్ని గుర్తుకు వచ్చి ఇంట్లో ఒంటరిగా ఏడుస్తుంటాను అని గతంలో చెప్పుకొచ్చారు కోట శ్రీనివాస రావు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *