పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల పంచాయతీ వివాదం రెండు హత్యలకు దారితీసింది. మాట్లాడుకుందామని చెప్పి పంచాయతీకి పిలిచి, ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో సుగ్లామ పల్లి లో రెండు మర్డర్లు జరిగాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన మారయ్య పెద్దపల్లి శాంతినగర్ కి చెందిన లక్ష్మీ తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. కుటుంబ కలహాలతో పుట్టింటి వద్దనే ఉంటుంది లక్ష్మి. అయితే మాట్లాడుకుందామని పంచాయతీ ఏర్పాటు చేసుకున్నారు ఇరువర్గాలు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో రెండు వర్గాలు సమావేశం అయ్యారు.
పంచాయతీ నడుస్తుండగానే ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో లక్ష్మి అన్నదమ్ములు బావ మారయ్య, తమ్ముడు మల్లేశంపై ఒక్కసారిగా దాడి చేశారు. కత్తులతో పొట్టపై పొడిచి చంపేశారు. దీంతో రెండు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ కత్తుల దాడిలో లక్ష్మీ బంధువు గణేష్ ను మారయ్య బంధువులు పొడిచి చంపేశారు. ఈ దాడిలో మారయ్య తమ్ముడు మధునయ్య కత్తిపోట్లకు గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు మారయ్య తండ్రి సారయ్య కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
మారయ్యపై కూడా కత్తులతో దాడి చేయడంతో చాకచక్యంగా తప్పించుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గణేష్ డెడ్ బాడీని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మారయ్య తమ్ముడు మల్లేశం తీవ్రగాయాలతో ఉండగా, మారయ్య తమ్ముడు మధు నయ్య తండ్రి సారయ్యను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు రిఫర్ చేశారు డాక్టర్లు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డిసిపి కరుణాకర్, సిఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..