హైదరాబాద్, జులై 17: ఇండియన్ విద్యార్ధులకు గూగుల్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. గూగుల్ అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. దాదాపు రూ. 19,500 ధరకు లభించే ఈ AI Pro ప్లాన్, హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్ టూల్స్ భారతీయ విద్యార్ధులకు మాత్రం ఉచితంగానే యాక్సెస్ అందిస్తుంది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరిట ఈ అవకాశాన్ని అందిస్తుంది. 18 ఏళ్లు అంతకు పై వయసు కలిగిన విద్యార్థులు ఏడాది పాటు Google AI Pro ప్లాన్ ఉచిత సబ్ స్క్రిప్షన్‌ను పొందొచ్చట. ఇందులో 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది. జెమినీ సేవలను ఉపయోగించుకోవడానికి విద్యార్థులు ముందుగా గూగుల్ ఆఫర్ పేజీ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నమోదుకు సెప్టెంబరు 15, 2025వ తేదీని చివరి తేదీగా గూగుల్ నిర్ణయించింది. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్లో పవర్‌పుల్ ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను ఉపయోగించుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌లో చేరిన తర్వాత జెమిని 2.5 ప్రో, దాని వీడియో జనరేషన్ AI మోడల్ అయిన Veo 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో Gmail, డాక్స్, ఇతర Google యాప్‌లలో 2TB క్లౌడ్ స్టోరేజ్, AI ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్‌లో చదువుకోవడానికి, రైటింగ్ రీసెర్చ్ ఉద్యోగానికి కావల్సిన టూల్స్ ఉన్నాయి. పరీక్షలు, హోంవర్కులు, వ్యాసరచన, కోడింగ్, ముఖాముఖీలకు అన్‌లిమిటెడ్ అకడమిక్స్ పోర్ట్ ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి
- హోంవర్క్ హెల్ప్& పరీక్ష తయారీ.. AI సహాయంతో 1500 పేజీల వరకు ఉన్న పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు.
- స్టడీ సపోర్ట్.. పొడవైన పాఠ్యపుస్తకాలను (1500 పేజీల వరకు) విశ్లేషించవచ్చు. పరీక్షల సమయంలో దీని సహాయం పొందవచ్చు. సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- రైటింగ్ టూల్స్.. చిత్తుప్రతులను రూపొందించడానికి, ఎస్సేలను మెరుగుపరచడానికి, ఆలోచనలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది
- వీడియో క్రియేషన్.. Googleలోని Veo 3 వ్యవస్థ ద్వారా టెక్స్ట్, ఇమేజ్‌లను చిన్న వీడియోలుగా మార్చవచ్చు.
- నోట్‌బుక్ ఎల్‌ఎమ్.. మరిన్ని ఆడియో, డాక్యుమెంట్ సారాంశాలతో మెరుగైన పరిశోధన అంశాలు తోడ్పడతాయి.
- జెమిని ఇంటిగ్రేషన్.. Gmail, డాక్స్, షీట్‌లు ఇతర యాప్‌లలో ప్రత్యక్ష AI సపోర్ట్ ఉంటుంది.
- క్లౌడ్ స్టోరేజ్.. అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్‌లు, మీడియా ఫైల్‌లను నిల్వ చేయడానికి డ్రైవ్, Gmail, ఫోటోలకు 2 టీజీ వరకు స్టోరేజ్ ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.