Upasana: మెగా కోడలి గొప్ప మనసు.. 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన.. నెటిజన్ల ప్రశంసలు

Upasana: మెగా కోడలి గొప్ప మనసు.. 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన.. నెటిజన్ల ప్రశంసలు


అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది మెగా కోడలు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ వీటిపై తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకుంది ఉపాసన. ఏకంగా 150 వృద్ధా శ్ర‌మాల‌ను ఆమె ద‌త్త‌త తీసుకుని సేవలో తమకు సాటి లేరని మరోసారి నిరూపించుకుంది. ఇక నుంచి ఈ అనాథాశ్రమాల బాధ్యత మొత్తం ఉపాస‌నే చూసుకోనుంది. ముఖ్యంగా వృద్ధులకు వైద్య సదుపాయాలు, పోషకాహారం, ఎమోషనల్ సపోర్ట్ కల్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది మెగా కోడలు. అయితే దీనిపై ఎక్కడా గానీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు ఉపాసన. కానీ ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు మెగా కోడలి గొప్ప మనసుపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆఖరి మజిలీలో అన్ని విధాలుగా అండగా..

అనాథ పిల్లలతో మెగా కోడలు ఉపాసన కొణిదెల

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *