అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానంటున్నారు పెద్దారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లితోపాటు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. మరి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారా? పోలీసులు అడ్డుకుంటారా? ఏం జరగనుంది? అనేది ఆసక్తిగా మారింది.
ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమానికి వైసీపీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా వైసీపీ ముఖ్యనేతలు.. తాడిపత్రి వెళ్లేందుకు సిద్దమయ్యారు. దాంతో,పెద్దారెడ్డి స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లీ తీరతానంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి రానిచ్చేది లేదని JC ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారా? లేక పోలీసులు మరోసారి అడ్డుకుంటారా అన్న టెన్షన్ కొనసాగుతోంది.
అయితే ఈ నెల 15నే వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైసీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మంత్రుల పర్యటన దృష్ట్యా వాయిదా వేసుకోవాలని ఏఎస్పీ రోహిత్‌కుమార్ కోరారు. దీంతో ఈనెల 18న లేదా ఆ తర్వాత సమావేశం నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసుల సూచనతో వైసీపీ సమావేశం వాయిదా వేసుకుంది. దాంతో తాడిపత్రిలో హైటెన్షన్‌కి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్లీ సమావేశానికి వైసీపీ ప్లాన్ వేయడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
తాడిపత్రిలో JC వర్గానికి, పెద్దారెడ్డి వర్గానికీ మధ్య వైరం ఈనాటికి కాదు. గతంలో ఏకంగా JC ఇంట్లోకి వెళ్లి మరీ పెద్దారెడ్డి వర్గం దాడి చేసింది. ఇక.. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోను, ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అప్పటి నుంచి తాడిపత్రిలో రాజకీయం వైల్డ్ ఫైర్‌గా మారింది.