తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టెకాఫ్ అయిన వెంటనే పైలట్లు ప్రాబ్లమ్ గుర్తించారు. సుమారు 45 నిమిషాల పాటు ఫ్లైట్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత తిరిగి తిరుపతి ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో వారంతా భయాందోళన చెందారు. అయితే ప్రయాణికుల కోసం ఇండిగోె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో తిరుపతి ఎయిర్ పోర్టులో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన నుంచి విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే చెన్నై – హైదారాబాద్ ఫ్లైట్‌లోనూ టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఆ సమయంలో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి చెన్నై ఎయిర్ పోర్టులో సురక్షితంగా ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇప్పుడు మరోసారి అటువంటి ఘటన జరగడంతో ప్యాసింజర్స్ బెంబేలెత్తిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..