తమిళనాడు దారుణ ఘటన వెలుగు చూసింది. తిరువళ్లూరులో 10 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెంబడించిన ఓ కామాందుడు.. ఆమెను ఎత్తుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. నిందితుడికి సంబంధించిన అనుమానిత చిత్రాలు పోలీసులు విడుదల చేశారు. అంతే కాకుండా ఎంతో చాకచక్యంగా కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకున్న బాలిక.. అటుగా వస్తున్న మరో బాలికను కిడ్నాపర్ కంట పడకుండా కాపాడినట్టు పోలీసు వర్గాలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరుకు చెందిన ఓ పదేళ్ల బాలిక జులై 12న తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా.. దారిలో బాలికను గమనించిన ఓ కామాదాండు ఆమెను వెంబడించింది.. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు. సమీపంలోని ఒక తోటలోకి తీసుకెళ్లి బాలికపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాలికపై నిందతుడు దాడికి పాల్పడ్డాడు. ఈక్రమంలో నిందితుడికి ఫోన్ రావడంతో.. అదే అదునుగా భావించిన బాలిక ఎంతో చాకఛక్యంగా నిందితుడి నుంచి తప్పించుకుంది.
నిందితుడి నుంచి తప్పించుకొని బయటకు పరుగులు తీస్తున్న బాలికకు.. అదే దారిలో నిందితుడు ఉన్న తోట వైపు మరో బాలిక రావడం కనిపించింది. అది గమనించిన బాలిక వెంటనే.. అటుగా వస్తున్న మరో బాలికకు జరిగిన విషయాన్ని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. దీంతో ఇద్దరూ ఆ కామాందుడి చర నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. నిందితుడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లి బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు తాజాగా బాలిక మరో అమ్మాయిని కాపాడిన విషయాన్ని స్థానిక సీసీ కెమెరా దృశ్యాల ద్వారా గుర్తించారు. కాగా నిందితుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.