లక్నోలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. తాను చైనీస్ రెస్టారెంట్ నుంచి పనీర్ కలిమిర్చ్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా అతనికి ‘చికెన్ కలిమిర్చ్’ డెలివరీ చేశారని ఓ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు రెస్టారెంట్, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. ఇందిరానగర్‌లోని పండిట్ పూర్వాలో నివసిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి మనీష్ తివారీ అనే వ్యక్తి విభూతి ఖండ్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఎదుర్కొన్న సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కామ్టా ప్రాంతంలోని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లానని, అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకొని సమీపంలోని ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్టు తెలిపారు.
అయితే శాఖాహారం తినాలని నిర్ణయించుకొని తివారీ, అతని ఫ్రెండ్స్ సమీపంలోని ఫేమస్ చైనీస్ రెస్టారెంట్ నుంచి ‘పనీర్ కాలిమిర్చ్ డైను ఆర్డర్ చేశారు. వారు ఆర్డర్ చేసిన కాసేపటికి డెలివరీ బాయ్ వచ్చి వాళ్ల ఆర్డర్‌ను ఇచ్చి వెళ్లిపోయాడు. ఇక ఆకలితో ఉన్న ఇద్దరు వెంటనే దాన్ని తినేందుకు సిద్ధమయ్యారు. పార్సిల్ ఓపెన్ చేసి తినడం స్టార్ చేశారు. ఈ క్రమంలో ఫుడ్ టేస్ట్‌లో వాళ్లకు తేడా రావడంతో పరిశీలించగా అది చికెన్ కాలిమర్స్‌గా గమనించారు. అయితే ఈ ఫుడ్ తిన్న కాసేపటికే తివారీ స్నేహితుడు వాంతులు చేసుకోవడంతో పాటు అనారోగ్య బారిన పడ్డాడు.
దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై ఆగ్రహించిన తివారీ వెంటనే విభూతి ఖండ్ పోలీసులను ఆశ్రయించాడు. తాను పన్నీరు కాలిమర్స్ ఆర్డర్ చేస్తే రెస్టారెంట్ నిర్లక్ష్యంగా చికెన్ కాలిమర్స్ డెలివరీ చేసిందని అతని ఫిర్యాదు చేశారు. అది తినడం వల్ల తన స్నేహితుడు అనారోగ్యానికి గురైనట్టు పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెస్టారెంట్‌పై కేసు నమోదు చేయాలని కోరాడు. తివారీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సదురు రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు విభూతి ఖండ్ SHO సునీల్ సింగ్ తెలిపారు. అయితే వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యల పాల్పడిన ఆరోపణలతో సదురు రెస్టారెంట్‌పై BNS చట్టంలోని 125 (a), 271, 272, 318 (4) వంటి పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.