Pawan Kalyan: మనల్నెవడ్రా ఆపేది..! పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్.. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు

Pawan Kalyan: మనల్నెవడ్రా ఆపేది..! పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్.. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధత్యలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది. జూలై 24న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?

తాజాగా హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  “తెలంగాణలో సభకి పర్మిషన్‌ ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు.  పాలిటిక్స్ లో మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా… ఆయనే ఈశ్వర్‌” అన్నారు. అలాగే మనల్నెవడ్రా ఆపేది.. అన్న మాటకు అర్థం చెప్పారు పవన్‌.  ఆయన మాట్లాడుతూ.. పవన్‌ ఎప్పుడూ రికార్డుల కోసం ఆశించలేదు, యాక్టర్‌ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనే నాది. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు.. గూండాలు నాదగ్గర లేవు. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చావ ఇంకా చావలేదు అన్నారు పవన్.

ఇది కూడా చదవండి: అప్పుడు యావరేజ్ అన్నారు.. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నారు..! ఓ సినిమా కోసం ఏకంగా అలా కనిపించింది ఈ అమ్మడు

అలాగే ” డబ్బుకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు.. బంధాలకే ప్రాముఖ్యతనిచ్చాను. నా గుండె నుంచి మీ గుండెకి.. రెండు గుండెల దూరం అంతే. చాలా కష్టాల్లో హరిహరవీరమల్లు చేశా.. పేరున్నా, ప్రధానమంత్రి తెలిసినా డబ్బులు రావు.  సినిమాతో అభిమానులను రంజింపజేయాలని చేశా. నేను కింద నుంచి వచ్చినవాడిని.. పెద్ద పెద్ద దర్శకులు లేరు. రీమేక్‌ చేస్తే డబ్బులు వస్తాయని అందరూ అనుకున్నారు. నేను చేసిన పాపమల్లా ఒక ఫ్లాప్‌ ఇవ్వడం. దాని తర్వాత ఇండస్ట్రీ లో గ్రిప్‌ రాలేదు. ఆ టైమ్‌లో నన్ను వెతుక్కుంటూ వచ్చింది త్రివిక్రమ్‌. నా మిత్రుడు… ఆత్మబంధువు అతను. కొత్త కథలు తీస్తే.. నా భార్యను, పిల్లలను ఎవరు పోషిస్తారు? నా పార్టీని ఎవరు నడుపుతారు? నాకు దేశం పిచ్చి.. సమాజ బాధ్యత పిచ్చి,.. నేనంటే ఫ్యాన్స్ కి పిచ్చి. వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్‌  ఈ సినిమా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..

ఈ సినిమాకు అంత ఆత్మవిశ్వాసంతో ఉండటానికి కారణం కీరవాణి. హరిహరవీరమల్లు బలానికి కారణం కీరవాణి. ఆయన అంకితభావం వల్లే ఇదంతా జరిగింది అన్నారు. అలాగే జ్యోతికృష్ణ ఖుషీ టైమ్‌ నుంచి తెలుసు. సినిమాను బాగా హ్యాండిల్‌ చేశారు. రోజుకి రెండు గంటలే కేటాయిస్తానని చెప్పా.. ఏడు నుంచి తొమ్మిది వరకు… ఇచ్చా. వారానికి ఐదు రోజులు ఇచ్చా అన్నారు పవన్. ఇక నిధి అగర్వాల్‌ని చూసి సిగ్గు తెచ్చుకుని ప్రమోషన్లకు వచ్చా. ఈ సినిమాకు హీరో నేనే.. అందుకే మీడియా ఇంటరాక్షన్ చేశా.. రేపూ, ఎల్లుండి కూడా మీడియా ఇంటరాక్షన్  చేస్తా. ప్రభుత్వం మనది వచ్చింది.. మన సినిమా రిలీజ్‌ అవుతుంది. భీమ్లానాయక్‌ని పంతం కోసం చూశారు. హరిహరవీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అన్నారు పవన్ . అదేవిధంగా భారత్‌ ఎవరినీ ఆక్రమించలేదు. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మొఘల్‌ తాలూకు అరాచకాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఛత్రపతి శివాజీలాంటి కథను చెప్పాలనిపించింది. హరిహరవీరమల్లు కల్పిత పాత్ర. సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చన్నదే కథ. కోహినూర్‌ని దృష్టిలో పెట్టుకుని క్రిష్‌గారు కథ చెప్పినప్పుడు నచ్చింది. ఈ సినిమా చేసినప్పుడు చాలా నలిగాం. ఎన్ని రికార్డులు చేస్తుందో చెప్పలేను. బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను. డ్యాన్సులు కూడా చేశాను.. కాలు కదిల్చాను. రియల లైఫ్‌ రౌడీలను ఎదుర్కొన్నా.. సినిమాల్లో రౌడీలను ఎదుర్కోవడానికి మళ్లీ బ్రషప్‌ చేశా. నేర్చుకున్న సెల్ప్‌ డిఫెన్స్ అన్నీ కలగలిపి క్లైమాక్స్ ని నేను కంపోజ్‌ చేశా.. ధర్మాన్ని చెప్పే మూవీ ఇది. సస్పెన్స్ సినిమా కాదు ఇది.. సినిమాలను అమ్మడం నాకు తెలియదు. 10, 15 రూపాయలతోనూ మనం కలెక్షన్లను చూశాం అన్నారు పవన్ చివరిలో మళ్లీ విశాఖపట్నంలో కలుసుకుందాం అని అన్నారు పవన్.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *