దేశభక్తి, జాతీయవాదం కలగలిసిన హరిహర వీరమల్లు చిత్రం అఖండ విజయం సాధించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతున్న హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలకు హాజరైన మంత్రి కందుల దుర్గేష్ అద్భుతమైన, ఉర్రూతలూగించే ప్రసంగంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కు, చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు, కర్ణాటక అటవీ శాఖ మంత్రికి, చిత్ర నిర్మాత ఏఎం రత్నంకు, చిత్ర యూనిట్ కు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. హరిహర వీరమల్లు టైటిల్ చూసినా, చిత్ర కథాంశాన్ని విన్నా దేశంలోని యువత దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సందేశాన్ని తెలుపుతుందన్నారు.
జాతీయ వాదంతో ఈ దేశం కోసం తాము నిలబడతామన్న భావంతో హరి హర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక వర్గం, కీరవాణి స్వరపరిచిన అద్భుత సంగీతం ప్రేక్షకులను రంజింప చేస్తుందని నమ్ముతున్నాను అన్నారు. యావత్ జాతి ఉద్వేగంగా, ఉత్సాహంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ వెనుక నడవాల్సిన అవసరం ఉందని ఘంటపథంగా తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ తో అగ్రశ్రేణి కథానాయకుడిగా ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయరంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవాడికి అధికారం తీసుకురావడానికి నిరంతరం, నిర్విరామ కృషి చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అందరి అభిమాన నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల అభివృద్ధి విషయంలో నిరంతర నిర్విరామ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. సినిమా రంగానికి, రాజకీయ రంగానికి సంబంధించి ఏ మాటలు చెబుతారో ఆ మాటలు తూచా తప్పకుండా పాటించి ఆచరణలో పెట్టే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాన్ని ప్రజా నాయకుడిగా కార్య క్షేత్రంలో అమలు చేస్తున్నారన్నారు. నేడు ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ వంటి నాయకులు మార్గదర్శకుడిగా నిలబడ్డారన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవతో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తాను మంత్రిని అయ్యానని తెలిపారు. ఒక పక్కన రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మరో పక్కన ఆయనకు సంబంధించిన సినిమాటోగ్రఫీకి తాను మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు, హీరో పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది వేదంగా పాటించే అభిమానులు దొరకడం ఆయన అదృష్టం అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, నిర్మాత ఏఎం రత్నం కు, చిత్ర యూనిట్ కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం అఖండ విజయం సాధించి రికార్డులు కొల్లగొట్టాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Telugu Cinema: టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‌గా.. ఎవరంటే..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..