Post Office Scheme: భార్యాభర్తలకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.9 వేలు..

Post Office Scheme: భార్యాభర్తలకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.9 వేలు..


ఈ మధ్య చాలా మంది పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు మళ్లుతున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా బెస్ట్‌గా ఉండడమే దీనికి కారణం. పోస్ట్ ఆఫీస్ పథకాలు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అవ్వగా.. చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంతో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పథకంలో ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా.. ప్రతి నెలా మంచి ఇన్‌కమ్ లభిస్తుంది. దీంతో చాలా మంది ఈ స్కీమ్‌ను ఎంచుకుంటున్నారు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అంటే ఏమిటి?

మీరు ఈ స్కీమ్‌లో కేవలం రూ. 1,000 తో ఖాతాను తెరవవచ్చు. ఇందులో సింగిల్, జాయింట్ అకౌంట్స్ తీసుకోవచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు జమ చేయవచ్చు. జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి నెలా వడ్డీ వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.4శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకం యొక్క కాలవ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. మీరు కోరుకుంటే మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు.

మీరు పిల్లల పేరుతోనూ అకౌంట్..

మీరు ఈ పథకాన్ని 10ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల పేరుతో కూడా తెరవొచ్చు. దీని నుండి ప్రతి నెలా వచ్చే వడ్డీని పిల్లల పాఠశాల ఫీజులు లేదా ఇతర ఖర్చులకు ఉపయోగించవచ్చు. వివాహం తర్వాత బలమైన ఆర్థిక ప్రణాళిక కావాలనుకునే జంటలకు కూడా ఈ పథకం బెస్ట్ ఆప్షన్.

ఈ పథకం ఎలా పనిచేస్తుంది?

ఈ పథకంలో డిపాజిట్ అమౌంట్‌పై వార్షిక వడ్డీని 12 భాగాలుగా విభజించి ప్రతి నెలా ఖాతాలో వేస్తారు. నెలవారీ వడ్డీని విత్ డ్రా చేసుకోకపోతే, అది మీ పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో డిపాజిట్ అవుతూనే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత మొత్తం ప్రిన్సిపల్‌ అమౌంట్‌ను కూడా తిరిగి పొందుతారు.

మీరు నెలకు ఎంత సంపాదిస్తారు?

మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ తెరిచి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు సంవత్సరానికి దాదాపు రూ. లక్షా 11 వేల వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి నెలా దాదాపు రూ.9,250 స్థిర ఆదాయం ఉంటుంది. మీరు సింగిల్ అకౌంట్‌లో రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు వార్షిక వడ్డీ రూ.66,600 లభిస్తుంది. ప్రతి నెలా దాదాపు రూ.5,550 ఆదాయం లభిస్తుంది.

మీ ఆర్థిక అవసరాలు మరియు లక్ష్యాలకు సరిపోయేలా పెట్టుబడి పెట్టాలి. ఖాతా తెరిచే ముందు అన్ని నియమ నిబంధనలను తెలుసుకోవాలి. ఈ పథకం తక్కువ రిస్క్ తో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *