చాలా మంది హీరోయిన్స్ నటనలో కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు. కొంతమంది ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ లోనైనా నటించడానికి కొంతమంది హీరోయిన్స్ రెడీ గా ఉంటారు. కొంతమంది స్కిన్ షోకి నో చెప్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది బోల్డ్ సీన్స్ లో నటించడానికి నో చెప్తుంటారు.
అలాగే ఈ హీరోయిన్ ఓ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించడంతో తన పేరెంట్స్ తనతో గొడవ పడ్డారని.. తనను కూతురే కాదన్నారని చెప్పి ఎమోష్నలైంది ఆమె.. ఆమె ఎవరో కాదు. రచిత రామ్. ఈ అమ్మడు కెరీర్‌ను కన్నడ టెలివిజన్ సీరియల్ “అరసి”తో ప్రారంభించింది. ఆమె తన సోదరి నిత్య రామ్‌తో కలిసి “బెంకియల్లి అరలిద హూవు” అనే సీరియల్లో కూడా నటించింది.
రచిత తండ్రి కె.ఎస్. రాము ఒక ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారుడు, దాదాపు 500 ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె కూడా శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి, 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె సోదరి నిత్య రామ్ కూడా నటిగా చేసి మెప్పించింది.
'ఐ లవ్ యు'లో రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఉపేంద్ర హీరోగా నటించారు. ఇదిలా ఉంటే బుల్బుల్ సినిమాలో 'కావేరి' పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సీన్స్ లో నటించింది. దాంతో తన పేరెంట్స్ తనను తిట్టారని.. తెలిపింది
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల పాదాలను పట్టుకుని క్షమాపణలు చెప్పినట్లు రచిత తెలిపింది. నటిగా నిన్ను ఒప్పుకుంటాం కానీ మా కూతురిగా మాత్రం ఒప్పుకోము అని తన తల్లి తనతో చెప్పిందని ఆమె ఎమోషనల్ అయ్యింది.