దిన ఫలాలు (జూలై 25, 2025): మేష రాశి వారి ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆదాయానికి లోటుండదు. మిథున రాశి వారి ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారాలు సాదా సీదాగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదరవచ్చు. మిత్రుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆపర్లు అందుతాయి. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్క బెడతారు. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రావలసిన డబ్బు, బాకీలు చేతికి అందుతాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి, ప్రత్యేక బాధ్యతలు అప్పగి స్తారు. వృత్తి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి జీవితంలో రాబడి నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయి లాభాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు సహకారం అందిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకరిద్దరు బంధు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగానే పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదానికి అనుకోని పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆశించిన శుభవార్త వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.