లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఆమె నటనకు, అందానికి, వ్యక్తిత్వానికి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో ఆమె ప్రత్యేకం. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా.. ?
ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్లో మలర్ పాత్రతో అభిమానుల హృదయాలను దొచుకుంది. ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. సాయి పల్లవి మలయాళంలో ఆల్-టైమ్ సూపర్ హిట్లలో ఒకటైన కస్తూరిమాన్ తమిళ వెర్షన్లో నటించింది.
2003లో వచ్చిన 'కస్తూరిమాన్' సినిమాలో మీరా జాస్మిన్, కుంచాకో బోబన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రంలో సాయి పల్లవి సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె కనిపిస్తుంటుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

అంటే ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందట. ప్రేమమ్ సినిమాకు సాయి పల్లవి రూ.10 లక్షలు తీసుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.