Korean Pancake: ఈ సీజన్ లో క్రిస్పీ కొరియన్ పాన్‌కేక్ బెస్ట్ స్నాక్.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండి ఇలా.. రెసిపీ

Korean Pancake: ఈ సీజన్ లో క్రిస్పీ కొరియన్ పాన్‌కేక్ బెస్ట్ స్నాక్.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండి ఇలా.. రెసిపీ


వర్షాకాలం లో ఇంట్లో కూర్చుని కొరియన్ సిరీస్‌ను చూడడం ఒక అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఆకలిగా అనిపించి.. క్రిస్పీగా, కారంగా ఉండే ఆహారాన్ని ఏదైనా తినాలని కోరుకుంటారు. అయితే వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినాలని అనిపించదు. హాట్ పాట్, కిమ్చి, డిప్పింగ్‌లు వంటి వివిధ రకాల కొరియన్ ఫుడ్ ని తినాలని మనసులో కోరిక కలుగుతుంది. మీరు కూడా కొరియన్ స్నాక్స్ ప్రయత్నించాలనుకుంటే, సింపుల్, క్రిస్పీ కొరియన్ స్టైల్ పాన్‌కేక్‌లు వర్షాకాలంలో సరైన ఎంపిక. ఇది స్ట్రీట్ ఫుడ్ రుచిని అందించే బెస్ట్ స్నాక్. కొరియన్ పాన్‌కేక్‌లను పజియోన్ అంటారు. వీటిని కూరగాయలతో లేదా కూరగాయలు లేకుండా తయారు చేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే తక్కువ నూనె తో పాన్‌లో వేయించుకునే స్నాక్ ఐటెమ్.

తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు:

ఆల్-పర్పస్ పిండి- ఒక కప్పు

ఇవి కూడా చదవండి

బియ్యం పిండి – రెండు టీస్పూన్లు

ఉల్లిపాయ- సగం కప్పు సన్నగా తరిగిన ముక్కలు

క్యారెట్- సన్నగా తరిగిన ముక్కలు

క్యాప్సికమ్- సన్నగా తరిగిన ముక్కలు

క్యాబేజీ- సన్నగా తరిగిన ముక్కలు

వెల్లుల్లి రెండు రెబ్బలు- తురిమిన ముక్కలు

ఉప్పు – రుచికి సరిపడా

సోయా సాస్ ఒక టీస్పూన్

నీరు – ఒక కప్పు

నూనె, నూనె లేదా నెయ్యి- వేయించడానికి సరిపడా

కొరియన్ పాన్‌కేక్‌లను ఎలా తయారు చేయాలంటే

దశ 1- ఒక గిన్నెలో ఆల్ పర్పస్ పిండి, బియ్యం పిండి, ఉప్పు, నీరు వేసి పిండి మిశ్రాన్ని బాగా కలిపి తయారు చేయండి.

దశ 2- ఈ పిండి మిశ్రమంలో తరిగిన అన్ని కూరగాయల ముక్కలు, వెల్లుల్లి, సోయా సాస్ జోడించండి. పిండిలో కలిపేలా మిక్స్ చేయండి.

దశ 3- నాన్-స్టిక్ పాన్ వేడి చేసి కొంచెం నూనె వేయండి.

దశ 4- ఇప్పుడు పిండిని పాన్‌లో పోసి చిల్లా లేదా దోసను పరచినట్లుగా ఒక చెంచాతో పిండిని పాన్ నిండా విస్తరించండి.

దశ 5- రెండు వైపులా బంగారు గోధుమ రంగు, క్రిస్పీగా వచ్చే వరకు వేయించండి.

దశ 6-వీటిని వేడి వేడిగా చట్నీతో లేదా సాస్ తో వడ్డించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *